ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు
- ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు అరెస్ట్
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
- ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు.. రూ.5.92 కోట్ల ఆస్తుల గుర్తింపు
- న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను నిన్న అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆయన్ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.
నిన్న ఉదయం నుంచి ఏసీబీ అధికారులు భుజంగరావుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన సుమారు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో రూ.5.92 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో రెండు ఇళ్లు, ఐదు ఓపెన్ ప్లాట్లు, ఒక వాణిజ్య భవనం ఉన్నాయి. వీటితో పాటు రూ.3.83 లక్షల నగదు, కిలో బంగారం, రెండు కార్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల డాక్యుమెంట్ విలువ రూ.5.92 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భుజంగరావు ఇంట్లో 29 మద్యం సీసాలు లభించడంతో, ఆ విషయాన్ని ఎక్సైజ్ శాఖకు నివేదించినట్లు ఏసీబీ తెలిపింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయనను 2024 మార్చిలో అరెస్ట్ చేయగా, తర్వాత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా అక్రమాస్తుల కేసు నమోదు కావడంతో ఏసీబీ ఆయన్ను మరోసారి అరెస్ట్ చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.